ధర్మ సందేహం
మనం చేసే పాప పుణ్యాలు మనం ఎంత వరకు రోజుకి అసలు రియలైజ్ అవుతాము?
నాకు వచ్చే విచిత్రమైన ఆలోచనలు ఒక్కోసారి ధర్మ సందేహాలతో లింక్ ఐతే ఇంక విచిత్రంగా ఉంటాయి. ఫర్ ఎక్షాంపుల్..ఇదిగో ఈ ఆలోచన..
ఎక్కడో అష్టాదశ పురాణాల్లో ఉంటుందిట, మన పాపాల చిట్ట మేయింటైన్ చేసే చిత్రగుప్తుడు అసలు లేడుట. మనం పడుకున్నప్పుడు మన కళ్ళే దేవుడి దగ్గర అన్నీ చెప్పేస్తాయిట. కాని అసలు మనం మన మనసులో ఎన్ని సార్లు నిజం గా realize ఔతాము అరె, అనవసరం గ ఇది చేసానే అనో..లేక ఈ పని mean గా చేసాను అనో? ట్రాఫిక్ సిగ్నల్ మారే లోగా ముందు కార్ వాడు కాస్త స్లో గా వెళ్ళడం వల్ల మనం ఆగాల్సివచ్చినా కూడా ఒక్కోసారి వాడిని తిట్టేస్కుంటాం అనవసరం గా.ఇలా అసలు రోజుకి ఎన్ని చేస్తూ ఉంటామో.మన సో కాల్డ్ ఆ పాప పుణ్యాల లిస్ట్ రోజూ వారీగా మనకి తెలిసి ఎప్పటికి అప్పుడు మనమే మన actions ని సమీక్షించుకోగలిగితే ప్రపంచం లో అందరం మంచి వాళ్ళుగా ఐపోవచ్చా?