శ ష ల ళ
ఈ మధ్య కాలం లో అసలు పిల్లలకి శ ష ల ళ పలకడం లో తేడా తెలియడం లేదా అనిపిస్తూ ఉంటుంది. (పిల్లలకే కాదేమో, పెద్దవాళ్ళకి కూడనూ).ఎప్పుడైనా తెలుగు కార్యక్రమాలు చూసినా, ముఖ్యం గా పాటలు వింటుంటే..అబ్బా ఈ ఉచ్చారణ సరిగ్గా ఉండి ఉంటే, ఇంకెంత బాగుండేది అనిపిస్తుంది. (ఉదాహరణకి ..ఈ పాట లో కల్ల ముందు స్వర్గముంచి అని పాడారు ...కళ్ళ ముందు అని పాడి ఉంటే బాగుండేది కదా. ఈ పాట కేవలం ఉదాహరణ మాత్రమే.In general తెలుగు రాని వారు పాడి ఉంటే, అది వేరే విషయం కాని, మన తెలుగు వారు కూడా చాలా మంది మరి అలానే పలుకుతారు.చెప్పే గురువులు సరిగ్గా చెప్పడం లేదో ఏంటో. Hmm..అసలు నేర్పేవారికైన సరిగ్గా తెలియాలిగా.
పాటల ప్రోగ్రాములు అవి నిర్వహించే బాలు గారు లాంటి పెద్దలైనా కొంచం ఇలాటి ఉచ్చారణా దోషాల గురించి ప్రస్తావిస్తే ఎంత బాగుంటుంది.
ఇదే మాట ఆ మధ్య ఓసారి ఫ్రెండ్స్ దగ్గర అంటే, "అమ్మమ్మ లా కబుర్లు చెప్పకు, నీకు అంత కష్టం గా ఉంటే, చెవులు మూస్కో" అన్నారు.Huh. Wonder if I am way too meticulous and obnoxious. :p
0 comments:
Post a Comment