Saturday, February 06, 2010

Random


మనుషుల్లో మార్పులు ఒక్కోసారి చాల ఆశ్చర్యం గా అనిపిస్తాయి.ముఖ్యం గా ఆడవాళ్ళలో. అప్పటిదాక ఎంతో ధైర్యవంతంగా ఉన్నా, ఎంతో అభిమానం గా ఉన్నా, ఒక్కసారి ఇంకో మనిషితో బంధం ఏర్పడ్డాక, ఆ అభిమానం/ఊరికే వచ్చే కోపం తగ్గిపోతాయా అనిపిస్తుంది. అభిమానం కోల్పోయి కాకపోవచ్చు,ఆ బంధం కోల్పోకూడదు అనే తాపత్రయం/అవతల మనిషికి ఇచ్చే గౌరవం వల్ల ఏమో?
ఈ రోజుల్లో చాలా శాతం బహుశా నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నప్పటికీ బంధాలు ప్రేమలు కావాలి, ఒక బంధం అంటూ ఏర్పడ్డాక దాన్ని నిలుపుకుని సర్దుకుని అర్థం చేస్కుని ఉన్నదాన్లో సంతోషంగా ఉండాలి అనుకునేవారు కూడా మరి ఉన్నారు. కాని ఉన్న జీవితం లో ఇలా బంధాలు వద్దు అని సడన్ గా దూరం చేసేస్కోవాలి అంటే, మనసు బాగా గాయపరుచుకోటమే అవుతుంది. కంపానియన్షిప్ అంటే కేవలం ఆనందంలోనే కాదు కదా.టఫ్ టైంస్ లో కూడా కలిసిమెలిసి ఉండాలిగా. ఇలాంటివి రాతల్లోనే బాగుంటాయి అనుకునేకంటే ప్రయత్నిస్తే అంత కష్టం కాదేమో.సున్నితమనస్కులు ఇంక వేరే బంధం అంటేనే డిప్రెషన్ కి గురయ్యే స్థాయికి తెచ్చుకునేలా రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ చేస్కోకుండా ఆనందం గా జీవితం ఉంచుకోవాలి అనుకోటం - asking for too much?

జీవితం లో మనిషి కి ఎన్ని ఉన్నా, శ్రీశ్రీ గారు అన్నట్టు "నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి,తోడొకరుండిన, అదే భాగ్యము,అదే స్వర్గము"

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP